పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ ప్రేమ, పెళ్లి వార్తలపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ స్పందించాడు. తను ఏదో అంటే.. పత్రికలు, ఛానెల్స్ మరోలా ప్రెజెంట్ చేశాయని వరుణ్ అన్నాడు. అవన్నీ రూమర్స్, వాటిని నమ్మకండి అంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. కాగా ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో వరుణ్ కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రకటించడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది.