ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల ముంబయిలో దర్శకుడు ఓం రౌత్ ఇంట్లో ప్రభాస్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, ఆదిపురుష్ చిత్రబృందం సమావేశమయ్యారు. ఈ సమయంలో ప్రభాస్ స్లిమ్‌గా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. దీంతో ప్రభాస్ నిజంగానే డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది.