కార్తికేయ 2 టీమ్‌కు ప్రభాస్ ప్రశంస

కార్తికేయ 2 మూవీ బృందానికి డార్లింగ్ ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపాడు. హీరో నిఖిల్‌తో పాటు చిత్ర బృందాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. కార్తికేయ 2 బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ట్వీట్ చేశాడు. మరోవైపు ప్రభాస్ అభినందనలపై స్పందించిన మూవీ బృందం థ్యాంక్యూ ప్రభాస్ గారు అంటూ రిప్లై ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ జంటగా నటించిన కార్తికేయ 2 ఆగస్టు 13న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్‌ను సాధిస్తోంది.

Exit mobile version