యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర రీసెంట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ షూట్లో ప్రభాస్‌తో పాటుగా శృతి హాసన్ కూడా జాయిన్ కానుందని సమాచారం. వీరిద్దరి మధ్య కొన్ని కీ సీన్స్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.