మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ టోర్నీ ఫైనల్ పోటీల్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానందకు చేధు అనుభవం ఎదురైంది. చైనాకు చెందిన ప్రపంచ నం.2 డింగ్ లిరెన్ (29)తో పోరాడి ఓడిపోయాడు. చెస్బుల్ మాస్టర్స్ 2022 ఆన్లైన్ టోర్నమెంట్ ఫైనల్ గేమ్ శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. లిరెన్ తన అనుభవాన్ని ఉపయోగించి టై-బ్రేక్ గేమ్‌ల రెండో మ్యాచ్‌లో ప్రజ్ఞానందను ఓడించాడు. చైనీస్ ఆటగాడు ఎత్తుగడల్లో విజయాన్ని సాధించి చెన్నైకి చెందిన 16 ఏళ్ల యువకుడి ఆశలను వమ్ము చేశాడు.