భారత చెస్ బాలమేధావి ప్రజ్ఞానంద, ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ను మరోసారి ఓడించాడు. 3నెలల క్రితమే కార్ల్సన్ పై గెలిచిన 16ఏళ్ల ప్రజ్ఞా.. మరోసారి ప్రపంచ విజేతకు ఓటమి రుచి చూపించాడు. నిజానికి డ్రాగా ముగియాల్సిన గేమ్, 40 మూవ్లో కార్ల్సన్ తప్పిదంతో ప్రజ్ఞా పరమైంది. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద ఈ ఘనత సాధించాడు. 16 మంది పాల్గొనే ఈ టోర్నీలో ప్రస్తుతం చైనా క్రీడాకారుడు వియివైయి 18 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.