బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సింహాసనంపై 70ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా లండన్ నిర్వహించిన వేడుకలు వైభవంగా ముగిశాయి. ఆదివారం వెస్ట్‌మినిస్టర్ యాబి చర్చిలో గంటలు మోగగానే 1200 మంది సైనికులు కవాతు నిర్వహించారు. 1953లో పట్టాభిషేకం వేళ రాణి ప్రయాణించిన బంగారపు గురప్రు బగ్గీ కూడా కవాతులో ప్రదర్శించారు. వేడుకల్లో మాట్లాడిన బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణన్ నిస్వార్థ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.