TS: ఈనెల 28 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. ముథోల్ నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాసంక్షేమం కోసం కేసీఆర్తో ఏ యుద్ధానికైనా సిద్ధమేనని తెలిపారు. ప్రధాని మోదీ సభతో కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యేలు భయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతి త్వరలోనే బయటపడుతుందని చెప్పుకొచ్చారు.
ఈనెల 28 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర

© ANI Photo