ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఉత్తరాఖండ్ సీఎం ఓడిపోవడంతో అక్కడ సీఎం ఎవరనే సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో గోవా, మణిపూర్ రాష్ట్రాల సీఎంలు ఫైనలయ్యారు. బుధవారం ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో సిట్టింగ్ సీఎంలకే అవకాశం ఇస్తూ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గోవా సీఎంగా ప్రమోద్ సావంత్, మణిపూర్ సీఎంగా ఎన్ బీరేన్ సింగ్ లు బాధ్యతలు చేపట్టనున్నారు. హోలీ పండుగ అనంతరం వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది.