ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ కాంగ్రెస్‌తో కలవబోతున్నాడా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ సంవత్సరం చివర్లో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే సంవత్సరంలో జరగబోయే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంట్రాక్టును ఆయనకే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం గుజరాత్ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడట. అయితే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ కు సహాయం చేసే విషయంపై ప్రశాంత్ కిషోర్ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.