KGF వరల్డ్‌కి ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. రాఖీబాయ్ క్యారెక్టర్‌ను చూసి చాలా ఎంజాయ్ చేశారు. కేజీఎఫ్3తో ఈ యూనివర్స్‌ను కొనసాగించే అవకాశం తప్పకుండా ఉంది. కానీ దానికి చాలా సమయం పడుతుందని ప్రశాంత్ నీల్ తాజాగా వెల్లడించాడు. కేజీఎఫ్3లో హృతిక్ రోషన్‌తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తెలుగు నటులు కూడా ఇందులో ఉండబోతున్నారట. దీంతో సినిమా దేశవ్యాప్తంగా ప్రస్తుతం బాహుబలి, కేజీఎఫ్‌కు ఉన్న రికార్డులను తిరగరాస్తుందని ఆశిస్తున్నారు.