నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ట్రైలర్ ఈ నెల 6న రిలీజ్ కానుంది. డైరెక్టర్ మలినేని గోపిచంద్ స్వస్థలం ఒంగోలులో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రి రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. ఈ మూవీలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.