ఈ ఉదయం బోయిగూడలోని ఓ స్క్రాప్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బయటపడ్డాడు. తాజాగా అతను ఈ ప్రమాదంపై స్టేట్మెంట్ ఇచ్చాడు. గోడౌన్ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. తాను రెండుళ్లుగా ఆ గోదాంలోనే పని చేస్తున్నానని చెప్పిన అతడు.. రాత్రి మూడు గంటల సమయంలో పొగలు మంటలు వ్యాపించాయన్నాడు. తాను ఎలాగోలా కిటికీలోంచి బయటికి దూకానని, మిగతావారంతా మంటల్లో చిక్కుకున్నారని తెలిపాడు. ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోడౌన్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.