అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం కింద పడ్డారు. డెలావేర్‌లోని పెన్ స్టేట్ పార్క్‌లో సైకిల్ పై రైడ్ చేస్తు కిందపడ్డారు. వెంటనే అక్కడ ఉన్నవారు అధ్యక్షుడిని పైకి లేపారు. అదృష్టవశాత్తు అధ్యక్షుడుకి ఏం గాయాలు కాలేదు. బైడెన్ పెళ్లి రోజు సందర్భంగా సరదాగా బయటకు వెళ్లిన నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.