ఉత్తరప్రదేశ్లో పార్టీ ఓటమిపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తనకు రాష్ట్రపతి పదవి ఇచ్చినా తీసుకోను. ఒకవేళ ఆ పదవి చేపట్టడానికి నేను ఆశ పడితే బీఎస్పీ అంతమైపోతుంది. యూపీ ఎన్నికల్లో బెహన్ జీ(మాయావతి)ని రాష్ట్రపతిని చేస్తామనే ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందిందని’ ఆమె పేర్కొన్నారు. కాని ఏ పార్టీ ఆ పదవినీ ఆఫర్ చేసినా తీసుకోనని స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది.