• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2 రోజుల్లో రాష్ట్రపతి ఎలక్షన్ నోటిఫికేషన్?

    భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవి కాలం జులై 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్ ఎన్నికకు నోటిఫికేషన్‌ను మరో 2 రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. BJP తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పూర్తి మెజారిటీ వస్తుందా లేదా చివరికి ఏ పార్టీ మద్దతు ఇస్తుందనేది చూడాలి. మరోవైపు ఆగస్టులో ఉపరాష్ట్రపతి పదవి కాలం కూడా పూర్తి కానుంది. ఈ తరుణంలో వెంకయ్యనాయుడుని రాష్ట్రపతి చేస్తారనే అంశం కూడా వినిపిస్తోంది.