గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాత్రి 7 గంటలకు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఆమె తొలిసారి ప్రసంగించనున్నారు. దేశ అభివృద్ధి, రాజ్యంగంలో కీలక ఘట్టాలపై ఆమె మాట్లాడే అవకాశం ఉంది. అటు గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆర్మీ సహా పలు రక్షణ విభాగాలు గణతంత్ర పరేడ్ రిహార్సల్స్ నిర్వహించాయి.