మునుగోడు ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. తాజాగా బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. కొత్త ఓటర్ల సంఖ్య 6 నెలల్లోనే పాతికవేలు దాటిందని…దీనిపై విచారణ జరపాలని కోరింది. అంతకుముందు 7 నెలల కాలంలో 1,474 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా…. ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక తెరాస హస్తం ఉందని ఆరోపించింది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. దీనిపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.