హైదరాబాద్‌లోని మల్లీప్లెక్స్ యాజమాన్యాలతో ఫిల్మ్ చాంబర్ మీటింగ్ ముగిసింది. టికెట్ ధరలు, తినుబండారాలు, వసతులపై చర్చించారు.తెలుగు రాష్ట్రాల్లో అన్ని మల్టీ ప్లెక్సుల్లో అనుసరించాల్సిన ధరలపైనా చర్చించారు. తినుబండారాల ధరలు తగ్గించాలని ఫిల్మ్ చాంబర్ సూచించచగా… మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అందుకు సానుకూలంగా స్పందించాయి.ధరలు, క్యాంటిటీ తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించాయి. నిర్మాతలు నిర్ణయించిన టికెట్ రేట్లే అమలు చేస్తామని మల్టీప్లెక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.