TS: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించే సూచనలు కనిపిస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ నుంచి ప్రారంభించేందుకు ప్రధాని రానున్నట్లు సమాచారం. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో మోదీ ప్రసంగించనున్నట్లు సమాచారం.