PRINCE MOVIE REVIEW: అనుదీప్- శివకార్తికేయన్ కామెడీ మ్యాజిక్ పనిచేసిందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PRINCE MOVIE REVIEW: అనుదీప్- శివకార్తికేయన్ కామెడీ మ్యాజిక్ పనిచేసిందా?

    PRINCE MOVIE REVIEW: అనుదీప్- శివకార్తికేయన్ కామెడీ మ్యాజిక్ పనిచేసిందా?

    October 21, 2022

    జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ తెరకెక్కించిన చిత్రం ప్రిన్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా  విడుదలైంది. జాతిరత్నాలుతో మంచి కామెడీ పంచిన అనుదీప్  ఈసారి తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్‌తో చేతులు కలిపాడు. ప్రిన్స్ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ద్విభాషా చిత్రంగా మార్చారు. జాతిరత్నాలుతో హిట్ అందుకున్న అనుదీప్ ప్రిన్స్‌తో మెప్పించాడా? ఆ స్థాయి కామెడీని పంచాడా? శివకార్తికేయన్‌తో చేసిన ప్రయోగం ఫలించిందా? ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు అనే అంశాలు ఈ  సమీక్షలో చూద్దాం.

    కథేంటి?

    ఆనంద్ (శివ కార్తికేయన్) ఓస్కూలు టీచర్. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన జెస్సికా (మరియా రియాబోషాప్కా) అదే పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తుంది. ఆనంద్,  జెస్సికాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడుతాడు. చివరికి ప్రేమను పొందినా.. ఆనంద్ తండ్రి (సత్యరాజ్) జెస్సికా తండ్రి కొన్ని కారణాల వల్ల వారిద్దరి ప్రేమను అంగీకరించరు. ఒక భారతీయుడు బ్రిటిష్ అమ్మాయి మధ్య సంబంధాన్ని గ్రామ ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. ఇక కోరుకున్న బ్రిటిష్ అమ్మాయిని పెళ్లాడే క్రమంలో శివకార్తికేయన్ అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. ఇంతకు ఆ సమస్యలు ఏమిటీ? ఇబ్బందులు ఏమిటీ? జెస్సికాను పెళ్లి చేసుకునేందుకు ఆనంద్ చేసిన పోరాటం ఏమిటీ అనేది మిగిలిన కథ

    ఎవరెలా చేశారు..?

    స్కూలు టీచర్ పాత్రలో శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ బాగుంది.సెటైరికల్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. వన్‌లైనర్ పంచులతో నవ్విస్తాడు. స్టార్‌ డామ్ పక్కన పెట్టి సాధారణ పాత్రలో ఒదిగిపోయాడు. శివకార్తికేయన్ స్క్రీన్ ప్రెజెన్స్ హెలారియస్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శివకార్తికేయన్ సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. శివకార్తికేయన్ తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించారు. సత్యరాజ్ పంచ్‌ డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. కొత్త హీరోయిన్ మరియా బ్రిటిష్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది.క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. పోస్ట్ ఇంటర్వెల్‌కు ముందు తమిళ కామెడియన్ సూరీ కనిపించడం.. క్లైమాక్స్‌లో అనుదీప్ కెమియో రోల్‌లో కనిపించడం హైలెట్.

    బలాలు- బలహీనతలు

    ఫస్టాప్‌ మొత్త ఫుల్ కామెడీ ఫ్లోలో వెళ్తుంది. బ్రిటిష్- ఇండియా గురించి ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇంటర్వెల్ వరకు కూల్ కామెడితో సాగుతుంది. శివకార్తికేయన్ పెళ్లికి ప్రధాన సమస్యను హెలారియస్‌గా చూపించారు. సెకండాఫ్‌లో కథ కాస్త సీరియస్‌గా వెళ్తుంది. ప్రేక్షకుడు కొన్ని సీన్లు అంచనా వేయవచ్చు. క్లైమాక్స్ రోటిన్‌గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా జాతిరత్నాలు మాదిరి మెసేజ్ ఓరియంటెడ్ స్పీచ్‌ను అనుదీప్ పెట్టాడు. ఇది కూడా ప్రేక్షకులను నవ్విస్తుంది.

    సాంకేతికంగా..?

    థమన్ సాంగ్స్ అంత గొప్పగా అనిపించకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. జెస్సికా సాంగ్ మెప్పిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్‌ కూడా రిచ్‌గా కనిపిస్తుంది. 

    చివరగా: ఈ దీపావళికి ప్యామిలీతో కలిసి ‘ప్రిన్స్‌’ను ఎంజాయ్ చేయవచ్చు.

    రేటింగ్: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version