హైదరాబాద్‌లో ప్రైవేట్ జెట్ల వినియోగం ఎక్కువగా మారనుందని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్, సీఈవో కనికా టేక్రివాల్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 150 ప్రైవేట్ జెట్లు సేవలందిస్తున్నాయన్నారు. తమ సంస్థ ద్వారా 28 విమానాలు నడుపుతుండగా, 2023లో మరో పది సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని వింగ్స్ ఇండియా 2022 సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొవిడ్ అనంతరం ప్రైవేట్ జెట్ల వినియోగం ఐదింతలు పెరిగిందని వివరించారు.