గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మదర్స్‌డే సందర్భంగా ఆమె గారాల పట్టి మాల్తీ ఫోటోను మొట్టమొదటిసారిగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. సరోగసీ ద్వారా నిక్ జోనస్, ప్రియాంక చోప్రా దంపతులు జనవరిలో బిడ్డకు జన్మనిచ్చారు. కానీ అప్పటినుంచి 100 రోజుల పాటు పాపను హాస్పిటల్‌లో NICUలో పెట్టినట్లు ప్రియాంక సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. మదర్స్ డే రోజు మా పాప ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.