ప్రముఖ నిర్మాత దిల్రాజు వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని అతడి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. గతంలో కూడా పోటీ చేసేందుకు ఒకసారి కేసీఆర్తో సమావేశమై చర్చించినప్పటికీ కారణాలేంటో తెలియదు కానీ పోటీలో దిగలేదు. అయితే ఈసారి టీఆర్ఎస్లో చేరి నిజామాబాద్ నుంచి కచ్చితంగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవున్నారట. నిజామాబాద్ ప్రజలకు ఆయన బాగా పరిచయం ఉండటం.. అక్కడ గుడి కట్టించి మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఎలాగైనా గెలుస్తాననే నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ మినహాయించి ఇప్పటివరకు సినిమా వాళ్లు రాజకీయాల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. మరి దిల్రాజు ఎందుకత నమ్మకంగా ఉన్నాడో చూడాలి.