వేరే మహిళతో కారులో ఉండగా తన భార్య చూసిందని ఆమెను కారుతో తొక్కించిన ఘటనలో నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా అరెస్టయ్యారు. మహారాష్ట్రలోని అంబోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న ఈ ఘటన జరగ్గా సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు యాస్మిన్ తలకు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే నిందితుడు తనపైకి కారు ఎక్కించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
నిర్మాత కిశోర్ మిశ్రా అరెస్టు

Courtesy Twitter:@JournalistRafi