సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న SSMB28 సినిమా ఈ నెల 18నుంచి షూటింగ్ జరుపుకోనుంది. అయితే, ఈ సినిమాలో రెండో హీరోయిన్గా శ్రీలీలను తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సినిమాలో ఒకటి, రెండు ఏంటి? వారిద్దరు హీరోయిన్స్. మేం ఎవరికీ నెంబర్లు ఇవ్వలేదు. అయినా, శ్రీలీలను సినిమాలోకి తీసుకుంటున్నట్లు మేం అధికారికంగా ప్రకటించలేదు. అయినా, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వార్తలు రాసుకుంటున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగవంశీ.