విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా.. పూరి జగన్నాథ్ ‘లైగర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ‘ఆఫట్’ అనే సాంగ్ ప్రోమోను రేపు(ఆగష్టు 4) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఫుల్ సాంగ్‌ను ఆగష్టు 5న విడుదల చేస్తామని వెల్లడించింది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.