టీమిండియా విధ్వంసక బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఇషాంత్ శర్మ, అజింక్య రహానేలు వారి కాంట్రాక్ట్ కోల్పోనున్నారు. వీరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్లు గ్రూప్ సి నుంచి గ్రూప్ బిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 21న జరిగే బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య టీ20 ర్యాంకింగ్స్లో నెం1 స్థానంలో ఉన్నాడు.