రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లపై ప్రముఖ సహస్రావధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు ప్రశంసలు కురిపించారు. కవలలకు కూడా సాధ్యం కాని విధంగా సారూప్యంగా నటించి చూపించారని కొనియాడారు. చిన్నవారైనప్పటికీ వారిద్దరికీ నమస్కారం చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. అచ్చ తెలుగులో రాసిన ‘నాటు నాటు’ ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషం. ముఖ్యంగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ గొప్పగా చేశారు. రాజమౌలి, కీరవాణి, చంద్రబోస్‌ల పాత్ర అమోఘం’ అని గరికపాటి కొనియాడారు. ‘నాటు నాటు’కు అవార్డు రావాలని అందరూ మొక్కోవాలలని ఆయన సూచించారు.