అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్ట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పారిపోయిన నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. అరెస్టైన 18 మంది కాల్ డేటా, నగదు లావాదేవీలు విశ్లేశిస్తున్నారు. ఈ కేసులో ఎక్కువమంది ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులతో కూడిన 4 వాట్సాప్ గ్రూప్ లను గుర్తించారు. ఒక్కో దాంట్లో 400 మంది విదేశీ మద్యవర్తులున్నారని వెల్లడించారు. వారిని మళ్లీ ఆకర్షించేందుకు గంజాయి, మత్తు ఇచ్చారన్నారు.. హోటల్ మేనేజర్ స్థాయి వ్యక్తులు కుమ్మక్కయ్యారని తెలిపారు.