కాంగ్రెస్ పార్టీతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని సీనియర్ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షణకు భాజపా విఘాతం కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. ‘దేశంలో ఆర్థిక అసమానతలను బీజేపీ పెంచి పోషిస్తోంది. ఒకరిద్దరు కార్పొరేట్లకే సంపదను దోచిపెడుతోంది. రాజ్యాంగాన్ని మార్చి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తోంది. బీజేపీ అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి’ అని భట్టి చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామంటూ కాంగ్రెస్ శ్రేణులతో ప్రమాణం చేయించారు.