కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. గోల్డ్ స్కామ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎంకు వ్యతిరేకంగా ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. నల్లచొక్కాలు ధరించి విమానంలో విజయన్ సీటు దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ జయరాజన్ వారిద్దరిని తోసేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం కన్నూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానంలో ఈ సంఘటన ఎదురైంది.