ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభా వ్యవహారాల సలహా మండలి భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ని అవమానించేలా తెదేపా ఎమ్మెల్యేల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే కాగితాలు చించి వేస్తారా అంటూ..? ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులుగా తెదేపా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు స్పందిస్తూ..’గతంలో మీరూ ఇలానే చేశారన్నాడు’. వెంటనే ముఖ్యమంత్రి స్పందిస్తూ ‘మేము ఇలా చేసినట్టు నిరూపిస్తే వెంటనే సీఎం పదవికీ రాజీనామా చేస్తానని, మంత్రి మండలిని రద్దు చేస్తానని జగన్ అన్నారు.