రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా చేస్తున్న దాడులకు ఏ మాత్రం భయపడని ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే యూరోపియన్ యూనియన్ దేశాల సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌కు మీరు ఉన్నారని నిరూపించుకోండి. మీరు లేకుండా మేము ఒంటరి, మీరు మాతో ఉన్నామని నిరూపించుకోండి. మేము మా దేశం కోసం, మా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాం. ఎవరూ మమ్మల్ని విడదీయలేరు, మేము శక్తివంతులం, మేము ఉక్రెయిన్లం’ అని చెప్పారు. దీంతో యూరోపియన్ పార్లమెంట్‌లో ఉన్నవాళ్ళంతా జెలెన్స్కీని నిలబడి అభినందించారు.