• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PSL; జాసన్ రాయ్ విధ్వంసం; 44 బంతుల్లోనే సెంచరీ

    ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్ పీఎస్ఎల్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసన్ రాయ్ విజృంభించాడు. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో రూసో (43 బంతుల్లో 100) తర్వాత పీఎస్ఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 241 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన రాయ్ ఆది నుంచి చెలరేగి ఆడాడు. ఇన్నింగ్స్ చివరి వరకూ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తం మీద 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.