బడుగు,బలహీన వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.బహిరంగసభలో 17 మంది మంత్రులతో పాటు ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని చెప్పారు. న్యాయభేరి పేరిట గురువారం నుంచి నాలుగు రోజుల బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు.