తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పోలియో మహమ్మారిని పూర్తి స్థాయిలో తరిమేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో మూడు రోజులపాటు 0–5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. మొదటి రోజు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అన్ని హెల్త్ సెంటర్లు, బస్టాండ్లు, అంగన్ వాడీల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. మరుసటి రెండు రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఇంకా వేసుకోని వారికి పోలియో చుక్కలు వేస్తారు.