కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఎదురైంది. తాజాగా పంజాబ్లో నలుగురు కాంగ్రెస్ నేతలు BJPలోకి జంప్ అయ్యారు. వీరు అక్కడ మాజీ మంత్రులు అవడం విశేషం. ఛండీగఢ్లో శనివారం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. చేరిన వారిలో బల్బీర్ సింగ్ సిద్దు, రాజ్ కుమార్ వెర్కా, సుందర్ శామ్ ఆరోరా, గుర్ ప్రీత్ సింగ్ కంగర్ ఉన్నారు. ఇటీవల గుజరాత్ లో హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ నుంచి జంప్ అయిన సంఘటన మరువక ముందే ఇప్పుడు కాంగ్రెస్ కు మరో షాక్ ఎదురైంది.