పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడుతూ విజయానికి మరింత చేరువైంది. పంజాబ్లో మొత్తం 117 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 59 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. కాని అనూహ్యంగా ఆప్ ఇప్పటికే 89 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ డీలా పడి 13 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. అలాగే కాంగ్రెస్ సీఎం చన్నీ సింగ్ వెనుకంజలో కొనసాగుతున్నాడు.