పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. కేవలం 17 సీట్లకే పరిమితమైంది. ఈ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించారు. అయితే తాజాగా తన రాజీనామా పత్రాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించినట్లు సిద్ధూ స్వయంగా వెల్లడించాడు. సోనియా కూడా ఆమోదం తెలిపిందని తెలిపాడు. కాగా దేశ వ్యాప్తంగా పార్టీని ప్రక్షాళన చేయాలని భావించిన సోనియా గాంధీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.