RCBతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 208 పరుగులు చేసి టార్గెట్‌ను ఛేదించింది. మయాంక్(32), ధావన్(43), రాజపక్స(43), ఓడియన్ స్మిత్(25), షారుఖ్ ఖాన్(24) రాణించడంతో సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. అటు RCB బౌలర్లలో సిరాజ్ 2, ఆకాష్ దీప్, హర్షల్ పటేల్, హాసరంగాకు చెరో వికెట్ దక్కింది.