రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో మూవీ అధికారికంగా ప్రకటితమైంది. ఎప్పటి నుంచో తన డ్రీం ప్రాజెక్టుగా చెబుతున్న పూరీ ‘జనగణమణ’ సినిమాను ‘JGM’ పేరుతో విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ అధికారిక పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. కరణ్ జోహార్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కూడా అనన్య పాండేనే హీరోయిన్. ఆగష్టు 03 2023న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.