ఛార్మీతో రిలేష‌న్‌షిప్ గురించి మొద‌టిసారి స్పందించిన పూరీజ‌గ‌న్నాథ్‌

Courtesy Instagram: puri connects

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ క‌లిసి పూరీ క‌నెక్ట్స్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను ప్రారంభించి చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు లైగ‌ర్ మూవీని కూడా ఈ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఛార్మీ, పూరీ ఎప్పుడూ క‌లిసే కనిపించ‌డంతో వారిద్ద‌రి రిలేష‌న్‌షిప్‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై మొద‌టిసారిగా పూరీ ఒక ఇంట‌ర్వ్యూలో స్పందించాడు. ఆమె వ‌య‌సు ఒక 50 ఏళ్లు ఉన్నా లేదా ఆమె లావుగా ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఛార్మీ యంగ్ ఏజ్‌లో ఉంది కాబ‌ట్టి అంద‌రూ అలాగే అనుకుంటారు. ఏ జంట‌కైనా మొద‌ట్లో శృంగార ఆక‌ర్ష‌ణ ఉంటుంది. కానీ అది కొంత‌కాలానికి చ‌చ్చిపోతుంది. స్నేహ‌మే క‌ల‌కాలం నిలుస్తుంది అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Exit mobile version