రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేసిన ఓ పోస్టుపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఓ బీచ్లో మందు బాటిల్ పట్టుకుని విజయ్ అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ చక్కటి సందేశాన్ని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. అయితే, ఆ ఫొటో పరిసరాలు మాల్దీవుల్లా కనిపించడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘గతేడాది రష్మికతో మీరూ మాల్దీవులు వెళ్లారు కదా. అప్పుడు రష్మికతో పాటు మీరు కూడా ఫొటోలు షేర్ చేస్తే బాగుండేది. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తే మేం మరింత ఆనందించేవాళ్లం’ అని కామెంట్లు పెడుతున్నారు.
-
Courtesy Instagram:vijaydevarakonda
-
Courtesy Instagram:RashmikaMandanna