విరామం తర్వాత పుష్ప2 షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. నేటి నుంచి వైజాగ్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుంది. ఈ మేరకు డైరెక్టర్ సుకుమార్ సిద్ధమయ్యాడు. తొలి సినిమా ఘన విజయం సాధించడంతో రెండో భాగంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ మరింత శ్రద్ధ కనబరిచారు. వీటితో పాటు మరికొంతమంది స్టార్ హీరోలను సినిమాలోకి తీసుకురానున్నారు. తొలి భాగం విడుదలై సంవత్సరం గడిచిపోయింది. ఈ క్రమంలో చిత్రీకరణను వేగవంతం చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.