• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌.. ‘క్వార్టర్‌, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఏ మూవీకి సాధ్యం కాని కలెక్షన్స్‌ సాధిస్తూ పలు రికార్డులను కొల్లగొడుతోంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్‌ నటన చూసి ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరో నేషనల్ అవార్డు పక్కా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సౌత్‌, నార్త్‌, ఓవర్సీస్‌ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్క చోట పుష్ప గాడి ప్రభంజనం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా ఈ స్థాయి సక్సెస్‌ సాధిస్తే సంబంధిత ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి, సలార్‌ సినిమా విషయంలో మనం ఇది చూశాం. కానీ ‘పుష్ప 2’ సక్సెస్ విషయంలో టాలీవుడ్‌ మౌనం వహిస్తోంది. పైగా కొందరు స్టార్స్‌ ఆ సినిమాను కించపరుస్తూ మాట్లాడటం చర్చకు తావిస్తోంది. 

    ‘క్వార్టర్ ఇస్తే ఎవరైనా వస్తారు’

    ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) ‘పుష్ప 2’ చిత్రంపై సంచలన కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అతడు నటించిన ‘మిస్‌ యు‘ చిత్రం ఈ వారమే తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప 2’ను కించపరిచేలా మాట్లాడాడు. పాట్నాలో భారీ జనసందోహంలో జరిగిన ‘పుష్ప 2’ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌పై ఆయన సెటైర్లు వేశారు. ‘మన దేశంలో జనసమీకరణం పెద్ద విషయమేమి కాదు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక కన్‌స్ట్రక్షన్‌ దగ్గ జేసీబీ వర్క్‌ జరుగుతున్నప్పుడు జనాలు గుమ్మికూడతారు. బిర్యానీ, క్వార్టర్‌ సీసా ఇస్తే పొలిటికల్‌ మీటింగ్‌కు జనాలు ఎగబడతారు. పొలిటికల్‌ మీటింగ్స్‌కు జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయని నమ్మకం లేదు. ఇండియాలో జనం గుమికూడడం సహజమే. ఇది చాలా చిన్న విషయం’ అంటూ సిద్ధార్థ్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు సోమవారం జరిగిన హరికథ వెబ్‌ సిరీస్‌ ఈవెంట్‌లో ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’ అంటూ సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడిన సంగతి తెలిసిందే. 

    రాజమౌళి మౌనం ఎందుకు?

    దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) ఇండస్ట్రీ నుంచి ఏ మంచి సినిమా వచ్చిన దగ్గరుండి ప్రశంసలు కురిపిస్తారు. ‘సలార్‌’ (Salaar), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో పాటు ఇటీవల వచ్చిన ‘దేవర’ గురించి కూడా ఆయన స్పందించారు. అటువంటి రాజమౌళి ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత సినిమా గురించి ఒక్క కామెంట్‌ చేయకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు స్వయంగా హాజరైన రాజమౌళి తాను అప్పటికే చూసిన ఇంట్రడక్షన్‌ సీన్‌పై భారీగా హైప్‌ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. అటువంటి జక్కన్న సినిమా రిలీజ్‌ తర్వాత సడెన్‌గా మౌన మునిగా మారిపోవడంపై సినీ లవర్స్‌ ఆశ్చర్యపోతున్నారు. జక్కన్న ఇలా ఎందుకు చేశాడని తెగ ఆలోచిస్తున్నారు. 

    మహేష్‌ రివ్యూ ఎక్కడ?

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ (Mahesh Babu) గత కొంతకాలంగా రివ్యూవర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలను స్వయంగా చూడటమే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కల్కి వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలతో పాటు మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం, మత్తు వదలరా 2 వంటి చిన్న సినిమాలకు సైతం మహేష్‌ ప్రశంసలు కురిపించారు. కానీ యావత్‌ దేశాన్ని షేక్‌ చేస్తోన్న ‘పుష్ప 2’ మాత్రం మహేష్ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అయితే దీనికి ఓ బలమైన కారణమే ఉందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. బాలయ్య టాక్‌షోలో బన్నీ చేసిన వ్యాఖ్యలు మహేష్‌ను నొప్పించి ఉంటాయని అంటున్నారు. ఆ షోలో  ప్రభాస్‌, మహేష్‌లలో నీకు ఎవరు పోటీ? అని బన్నీని బాలయ్య అడుగుతాడు. అప్పుడు ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ పాడుతూ తనకు తనతోనే పోటీ అంటూ బన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఈ సమాధానం మహేష్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చలేదు. 

    బన్నీ యాటిట్యూడే కారణమా?

    ‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంపై టాలీవుడ్‌ పెద్దలు సంతోషంగా ఉన్నప్పటికీ ఆ సినిమా చేసిన డ్యామేజ్‌ విషయంలో మాత్రం వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకొని ఓ మహిళ మృతి సంగతి తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెన్‌ఫిట్‌ షోలకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం వల్ల సంక్రాంతికి రాబోయే చిత్రాలు బాగా ఎఫెక్ట్‌ కానున్నాయి. బన్నీ ఆ రోజు థియేటర్‌కు రాకుండా ఉంటే ఇలాంటి తప్పిదం జరిగేది కాదని సినీ పెద్దలు భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి విషయంలో అతడు వ్యవహార శైలి కూడా సరిగా లేదని అభిప్రాయపడుతున్నారట. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సక్సెస్‌పై ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రశంసలు రావట్లేదని టాక్‌ వినిపిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv