ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప-ది రైజ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ఊహకందని రీతిలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక, జనవరిలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా హిట్ అయింది. కాగా, గతవారం స్టార్ మాలో ఈ చిత్రం టెలికాస్ట్ అయింది. ఈ నేపథ్యంలో BARC నివేదిక ప్రకారం 22.5 TRP రేటింగ్లను నమోదు చేసి టెలివిజన్ లో కూడా మంచి హైప్ సంపాందించింది.