అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ ఫీవర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ పుష్ప స్టైల్ లో వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫీవర్ ఖండాలు కూడా దాటినట్లు కనిపిస్తుంది. గ్లూస్టర్ షైర్ సోమర్ సెట్ మధ్య జరిగిన మ్యాచులో పాక్ బౌలర్ ఆమీర్ పుష్ప ఫీట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.