ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌లో రీపోలింగ్ నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. తమ మద్దతుదారులను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. సీఈసీపై తాము నమ్మకంగా ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు లేవని పేర్కొన్నారు. రాంపూర్‌లో భాజపా అభ్యర్థి ఆకాశ్ సక్సేనా అసిం రాజాపై గెలిచారు. ఉపఎన్నికలో కేవలం 30 శాతానికిపైగా పోలింగ్ నమోదవటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.