రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(69) రహస్య ప్రేమికురాలు అలీనా కబేవా(38) గర్భవతి అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జిమ్నాస్ట్ అయిన కబేవాతో 2008 నుంచి పుతిన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడ పుట్టారని సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వీరందరినీ ఓ రహస్య ప్రదేశంలో పుతిన్ దాచిపెట్టాడట. అలాగే ఇటీవలే ఆమె గర్భం కూడ దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి బంధంపై పుతిన్ ఇప్పటి వరకు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు.